తాజ్ రికార్డు బద్ధలు భారీగా పెరిగిన అయోధ్య సందర్శకుల సంఖ్య
Ayodhya has seen a huge increase in the number of visitors to Taj
లక్నో: తాజ్ మహాల్ సందర్శకుల రికార్డులను అయోధ్య రామాలయం కేవలం 9 నెలల్లోనే బద్ధలు కొట్టింది. జనవరి 22న ప్రారంభమైన అయోధ్య శ్రీ రామాలయానికి 9 నెలలకాలంగా 13.55 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. ఇదే సమయంలో ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శకుల సంఖ్య 12.51 కోట్లుగా ఉంది. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని ఆలయ కమిటీ తెలిపింది. యూపీలోని అన్ని పర్యాటక కేంద్రాలకు కలిపి 47.61 కోట్ల మంది సందర్శించారని పర్యాటక శాఖ మంత్రి జై వీర్ తెలిపారు. వారణాసి 6.2 కోట్లు, ప్రయాగ్ రాజ్ 4.80 కోట్లు, మధుర 6.8 కోట్లు, మీర్జాపూర్ 1.18 కోట్ల మంది సందర్శించారన్నారు. తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుండగా, దేశీయ టూరిస్టుల సంఖ్య తగ్గుతుంది.