జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జైపూర్: జైపూర్ సవాయి మాధోపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం వేకువజామున సవాయ్ మాధోపూర్ ఎక్స్ ప్రెస్ వే నుంచి రణతంబోర్ వినాయక ఆలయానికి దర్శనానికి కారులో మనీష్ శర్మ, కైలాష్ శర్మ, రామావతార్ శర్మ, సతీష్ శర్మ, ఇద్దరు అదే కుటుంబానికి చెందిన మహిళలు వెళుతున్నారు. బౌన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనాస్ వంతెన సమీపానికి కారు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు బౌన్లీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స నిమిత్తం చేర్చారు. తరువాత వారికి మెరుగైన చికిత్స కోసం జైపూర్ కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.