అమెరికా, యూరోప్ దేశాలు అశాంతికి కారణం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం స్పందించారు. అమెరికా, యూరోపియన్ దేశాలు పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలకు కారణమన్నారు. పశ్చిమాసియాలో అశాంతికి ఇవే కారణాలన్నారు. ఇక్కడి ప్రాంతాలను విడిచిపెడితే యుద్ధాలు, వివాదాలు ముగుస్తాయన్నారు. ఇప్పుడు జియోనిస్ట్ పాలన ముగిసిందని ఖమేనీ అన్నారు. దేవుని సహాయంతో, ఇరాన్ ప్రజల కృషితో, ఇస్లామిక్ విప్లవం నుంచి ప్రేరణ, ఇతర దేశాల సహకారంతో, ఈ ప్రాంతం నుండి మన శత్రువులను తొలగిస్తామని ఖమేనీ అన్నారు. అమెరికా, కొన్ని ఐరోపా దేశాలు తమ దృష్టిని ఈ ప్రాంతంపై మళ్లిస్తే, నిస్సందేహంగా ఈ వివాదాలు, యుద్ధాలు పూర్తిగా ముగుస్తాయని ఖమేనీ పేర్కొన్నారు. అప్పుడు మధ్యప్రాచ్యం దేశాలు శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సుతో కలిసి జీవించగలవని ఖమేనీ తెలిపారు.