కిర్గిస్థాన్ లో అల్లర్లు భారతీయులకు అలర్ట్ జారీ
Riots in Kyrgyzstan alert issued to Indians
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో విదేశీయులతో స్థానికుల ఘర్షణ కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో భారతీయ విద్యార్థులు అలర్ట్ గా ఉండాలని నిరంతరం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని శనివారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ అప్రమత్తతను ప్రకటించారు. కిర్గిస్థాన్ లో సుమారు 15వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. బిష్కెక్ లో విద్యనభ్యసిస్తున్న భారతీయులపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నా నివురు గప్పిన నిప్పులానే ఉన్నాయని పేర్కొన్నారు. అనవసరంగా భారతీయ విద్యార్థులు దూర ప్రాంతాలకు, నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లకూడదని ఆ దేశంలో ఉన్న రాయబార కార్యాలయం భారతీయులకు విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.