నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లో పసిడిపై మగువలకే గాక, మగాళ్లకు ఉన్న మోజు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దేశాలు కూడా బంగారాన్ని ఎక్కువగా భారత్ కే దిగుమతి చేయాలని భావిస్తుంటాయి. ప్రస్తుతం భారత్ లో బంగారం ధర ఇటు అటుగా గ్రాము ధర రూ. 8వేలకు చేరింది అంటే 10 గ్రాముల 24 కెరెట్ ల బంగారం ధర సుమారుగా 80వేల చేరువలో నమోదవుతోంది. మరికొన్ని రోజుల్లో బంగారం లక్ష రూపాయలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లోనైనా పసిడి ధరలకు కళ్లెం పడేలా లేదు.
ప్రపంచంలో బంగారమెంత?..
ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం (మనుషులు ధరించినది కూడా) కలిపితే నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పటివరకూ వెలికితీసిన బంగారం 21 మీటర్ల పొడవు, వెడల్పు ఉన్న చతురస్రాకారపు గది అంత ఉంటుందట. అసలు మానవాళికి బంగారం అంటే ఇంత మక్కువ ఎందుకు కలిగింది? భూమిపై తొలుత ఏ లోహాన్ని కనుగొన్నారు? పసిడి కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం.
భూమిపైకి ఎలా వచ్చింది?..
నక్షత్రాలు విచ్ఛిన్నం (సూపర్ నోవా విస్ఫోటనం) కావడం అవి భూమిపై పడడంతో బంగారం ఏర్పడింది. ఇదే సమయంలో బంగారం భూమిపై ఎలా ఉందన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.
తొలి లోహం..
వెయ్యి సంవత్సరాల క్రితం తొలిసారిగా మానవుడు రాగి లోహాన్ని కనుగొన్నాడు. అంతకుముందు కాలంలో రాళ్లు, ఎముకలతో కూడిన ఆయుధాలు, పరికరాలను వాడేవారు. రాగిని కనుగొన్నాక దాన్ని పనిముట్ల తయారీని చేపట్టాడు.
ద్వితీయ లోహం పసిడే!..
రెండో లోహం గా బంగారాన్ని కనుగొన్నాడు. దీన్ని ప్రపంచంలో ఎక్కడ, ఎవరు కనుగొన్నారనే విషయంపై స్పష్టత లేదు. మోసపటోమియా నాగరికత సమయంలో నదీ తీరాల్లో శుద్ధమైన బంగారాన్ని వెలికితీయగలిగాడు. పసిడి మెరుపు కారణంగా మనుషుల ఆభరణాలపై వాడాడు.
పురుషులే అత్యధికంగా ధరించేవారు!..
అత్యంత పురాతన ఆభరణం క్రీ.పూ. 4500 సంవత్సరంలో రూపొందించినట్లు కనుగొన్నారు. ఈ ఆభరణం బల్గేరియాలోని ‘వార్ని నెక్రోపోలిస్’ అనే మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉంది. ఈ ఆభరణాన్ని ధరించింది ఓ పురుషుడు కావడం విశేషం. ఆభరణంతోపాటు మానవ మృతకళేబరం లభించింది. దీని మెడలో ఈ ఆభరణం ఉంది.
బంగారం మాస్క్ తోనే క్లియోపాట్రా నిద్దుర!..
3 వేల సంవత్సరం క్రీ.పూ.ఈజిప్టు రాజులు, రాణులు దేవుళ్లు, దేవతల శరీర భాగాలుగా భావించేవారు. వీటితో కూడిన ఆభరణాలు ధరించడం వల్ల తమలో దివ్యశక్తి ఉత్పన్నం అవుతుందని నమ్మేవారు. ఈజిప్టు వాసులకు బంగారం మక్కువ ఉండదనేందుకు 1922లో తూతున్ కామేన్ లోని ఓ సమాధిని కనుగొన్నారు. ఆ సమాధి 3300 క్రీ.పూ. గా శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ సమాధిలో బంగారంతో కూడిన కిరిటం, పెట్టె లభించింది. పెట్టె నిండా ఆభరణాలున్నాయి. ఈజిప్టు రాణి క్లియోపాట్రా రాత్రి పడుకునేముందు బంగారంతో కూడిన మాస్క్ ను వేసి పడుకునేవారని చెబుతారు. క్రీ.పూ. 700లో అత్యంత ప్రాచీన బంగారం నాణేం టర్కీ లో తయారైనట్లు ఆధారాలు లభించాయి. రోమన్ సామ్రాజ్యంలో క్రీ.పూ. 100లో అరియన్స్ అనే నాణెం వాడుకలో ఉన్నట్లు గుర్తించారు.
భారత్ పసిడి చరిత్ర పురాతనమైనదే!..
భారత్ లో క్రీ.పూ. 100లో భారత్ లో శివుని రూపంతో కూడిన నాణెం రూపొందించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇలా పసిడి చరిత్ర ఇంత పురాతనమైనది, బలమైనది కాబట్టే కాలానుగుణంగా బంగారంపై మానవుడికి మక్కువ పెరిగింది. దీంతో వినియోగం కూడా భారీగా పెరిగింది. హిందూ ధర్మంలో ఋగ్వేదం, రామాయణం, మహాభారతంలో బంగారం వినియోగం, మహాత్మ్యంపై అనేక విషయాలు ఉన్నాయి.
క్రిస్టియన్ లు పవిత్రంగా భావించే బైబిల్ లో కూడా బంగారానికి సంబంధించి 400 వర్ణణలున్నాయి. ఇస్లామ్ గ్రంథాల్లోనూ బంగారానికి సంబంధించిన వివరాలున్నాయి. కానీ ఇస్లామ్ లో పురుషులు బంగారం ధరించకూడదనే వర్ణన లభిస్తుంది. అదే సమయంలో మహిళలు మాత్రం బంగారం ధరించవచ్చనే కథనాలు లభిస్తాయి.
1,87,200కేజీల బంగారం వెలికితీత!..
బంగారం కెమికల్ నామం ‘ఏయూ’ దీని సాంకేతిక సంఖ్య 79. దీని బరువు 196.197. బంగారం స్పెసిఫిక్ గ్రావిటీ 19.3. అంటే ఒక బాటిల్ లో 1లీటర్ నీరు ఉంటే అదే బాటిల్ లో 19.3కేజీల బంగారంతో నింపేయవచ్చు. బంగారం 1064 డిగ్రీల సెంటీగ్రేడ్ ల వద్ద కరగడం మొదలవుతుంది. దీన్ని పూర్తిగా కరిగించేందుకు 2808 డిగ్రీల సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. ఇప్పటివరకూ 1,87,200బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా బయటికి తీశారు.
10 గ్రాముల బంగారం 25 కిలోమీటర్లా?!..
10గ్రాముల బంగారాన్ని సన్నని తీగలా మారిస్తే అది 25 కిలోమీటర్ల వరకూ వెళుతుంది. దీని మందం 5 మైక్రాన్లుగా ఉంటుంది. 30 గ్రాముల బంగారాన్ని వెలికి తీయాలంటే 5 కోట్ల రూపాయల వజ్రాలు వెలికితీసినంత ఖర్చు అవుతుంది. ఒక టన్ను బంగారం మైన్స్ నుంచి కేవలం 5–8 గ్రాముల బంగారం మాత్రమే బయటికి వస్తుంది.
భారత్ లో బంగారం గనులు..
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ – కర్ణాటక
హట్టి గోల్డ్ మైన్స్ – కర్ణాటక
రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ – ఆంధ్రప్రదేశ్