సీఎంను అర్థరాత్రి కలిసిందెందుకు?
అనంత్ అంబానీ, ఉద్ధవ్ కలవడం వెనుక మతలబేంటీ? వేడెక్కుతున్న మహా రాజకీయాలు
ముంబాయి: మహారాష్ర్టలో ఎన్నికల ప్రకటనకు ముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబాయిలో మంగళవారం అర్థరాత్రి సీఎం షిండేను కలిసేందుకు ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు అనంత్ అంబానీ, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేలు కలిశారు. కేంద్రమంత్రి అమిత్ షా మహా పర్యటనలో మహాయుతి విజయం తథ్యమని ప్రకటన వెలువడిన వెంటనే అదే రోజు రాత్రి వీరిద్దరూ సీఎం షిండేతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ర్టలో కాంగ్రెస్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వవద్దనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మహాయుతిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా చేరతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్దవ్ అంటే రాజకీయ నాయకుడే కాబట్టి ఈ కలయికకు అంత ప్రాధాన్యత ఉండడం సహజమేనంటున్నారు. అదే సమయంలో అనంత్ అంబానీ కలవడం వెనుకే పరమార్థం అర్థం కావడం లేదని భావిస్తున్నారు. మహారాష్ర్టలో త్వరలో 228 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.