రైల్వే సేవల పటిష్ఠానికి పార్లమెంట్​ లో సవరణ బిల్లు

  ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

Aug 9, 2024 - 19:04
 0
రైల్వే సేవల పటిష్ఠానికి పార్లమెంట్​ లో సవరణ బిల్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైల్వే బోర్డు అధికారులను మరింత పటిష్ఠం చేసేందుకు, సేవలను మెరుగుపరిచేందుకు రైల్వే సవరణ చట్టాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ శుక్రవారం పార్లమెంట్​ లో రైల్వే సవరణ బిల్లును –2024ను ప్రవేశపెట్టారు.

ఈ సవరణ ప్రకారం 1905 రైల్వే బోర్టు చట్టంలోని ప్రతిపాదనలను 1989 రైల్వే చట్టంలోకి మార్చనున్నారు. దీంతో ఇక నుంచి రైల్వేలో ఒకే చట్టాన్ని మాత్రమే ప్రస్తావించే అవకాశం కలుగుతుంది. అంతేగాక సవరణలో రైల్వే ఆధునీకరణకు సంబంధించిన పలు సవరణలు చేపట్టారు. ఈ సవరణల ద్వారా రైల్వేబోర్డు మరింత స్వతంత్రంగా పనిచేయనుంది. బడ్జెట్​ కేటాయింపులు, ఆర్థిక చిక్కుముడులు లేకుండా సవరణలతో అవకాశం కల్పించినట్లయింది.