ట్రూడోకు సొంత ఎంపీల ఝలక్​

తప్పుకోవాలంటున్న 30 మంది ఎంపీలు ప్రజాదరణలో 70 శాతం యూటర్న్​ 

Oct 18, 2024 - 20:21
Oct 18, 2024 - 20:22
 0
ట్రూడోకు సొంత ఎంపీల ఝలక్​

ఒట్టావా:   కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకు భారత్‌తో కావాలనే సంబంధాలను చెడగొట్టుకునేలా ఆరోపణలు చేశారు ఆ దేశ ఎంపీలు 30 మంది ఉన్నారు. ట్రూడో పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఒక్కసారిగా ఎంపీల తిరుగుబాటుతో ట్రూడో ప్రజాదరణ పూర్తిగా అడుగంటి పోయింది. సామాజిక మాధ్యమాల్లో భారత్ తో ఈయన వ్యవహారశైలిపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూ 30మంది ఎంపీలకు విశేషంగా మద్ధతు లభిస్తుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ట్రూడో ప్రభుత్వం ఊగిసలాటలో పడింది. ఆయన యూటర్న్ (ట్రూడో పీఛేముడ్) అన్న 24 గంటల్లో ఆయనకు 70 శాతం మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రజాస్వామ్య తిరుగుబాటు మొదలైంది.

ఒట్టావాలో సగానికి పైగా ప్రజలు భారత్‌తో తామున్నామంటూ సోషల్ మీడియాలో మద్దతిస్తున్నారు. నమ్మకం, విశ్వసనీయత, నిబద్ధత, నిజాయితీలకు భారత్ (ప్రధాని మోదీ) పెట్టింది పేరనే వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమంగా కనిపిస్తున్నాయి. దీంతో ట్రూడో ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ భారత్ ను ఇరకాటంలో పెట్టాలనే ఆలోచనతో తానే ఇరకాటంలో పడ్డాడు. ప్రస్తుతం భారత్‌ కాళ్లావేళ్లా పడి సత్సంబంధాల కోసం అర్రులు చాస్తున్నాడు. ఇప్పుడూ ట్రూడోకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురు కానున్నాయా? అనే అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.