ఏకాకిని చేద్దామనుకొని ఏకాకైపోయిన యూరోపియన్​ దేశాలు

European countries united to do it alone

Nov 16, 2024 - 13:02
Nov 16, 2024 - 13:02
 0
ఏకాకిని చేద్దామనుకొని ఏకాకైపోయిన యూరోపియన్​ దేశాలు
నాటో దేశాలకు చేయిచ్చిన అమెరికా!
ఉచ్చులో చిక్కుకోని భారత్​
రష్యాను ఏకాకిని చేద్దామని
తామే నరక కూపంలోకి నాటోదేశాలు
బాబోయ్​ క్రూడాయిల్​ఇవ్వండి మహాప్రభో
భారత్​ కు విన్నపాల క్యూ
రష్యా నుంచి అగ్గువకే కొనుగోలు
50 శాతం మూసివేత దిశగా యూరోపియన్​ దేశాల చమురు సంస్థలు
రోజుకు 3 లక్షల బ్యారెల్స్​ ఎగుమతి దిశగా భారత్​ చర్యలు
మోదీ నిర్ణయాన్ని కొనియాడుతున్న ప్రపంచదేశాలు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ప్రధాని నరేంద్ర మోదీ సూదూర దృష్టితో భారత్​ తీవ్ర ఆర్థిక మాంద్యం నుంచి బయటపడింది. అమ్మోరికా (అమెరికా) పన్నిన ఉచ్చులో చిక్కుకోకుండా కర్రవిరగకుండా పామును చంపింది. తద్ఫలితంగా ప్రపంచంలోనే ప్రతీ రంగంలో అభివృద్ధిని సాధిస్తూ అమెరికాకూ ముచ్చెమటలు పట్టిస్తోంది. అమెరికాను నమ్మిన ఐరోపా దేశాలకూ అండగా నిలుస్తుంది. చాణక్య రాజనీతితో ప్రధాని మోదీ తీసుకున్న ప్రపంచ రాజకీయాలకు అతీతంగా తీసుకున్న నిర్ణయంతో అన్నిదేశాల్లోనూ మోదీ పేరు మారుమ్రోగిపోతుంది. ఆర్థికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, బడా వ్యాపారులు, వాణిజ్య వర్గాలు అమ్మో అమెరికా ఇంత పనిచేసిందా? అని నోరెళ్లబెట్టుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళదాం..
 
రష్యా–ఉక్రెయిన్​ యుద్ధంతో రష్యాను ఏకాకిని చేద్దామని అమెరికా ప్రపంచదేశాలతో కలిసి తనకు నష్టం జరగకుండా నాటోదేశాలను సమావేశపరిచింది. 2022లో ఈ సమావేశంలో రష్యా నుంచి ఎగుమతులు, దిగుమతులు అన్ని రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా పిలుపుతో ఇటలీ, జర్మనీ, యూనైటెడ్​ కింగ్​ డమ్​, ఫ్​రాన్స్​, నెదర్లాండ్స్​, స్విట్జర్లాండ్​, గ్రీస్​, పోలాండ్​, ఉక్రెయిన్​, స్వీడన్​, బెల్జియం, ఆస్ర్టియా లాంటి 44 దేశాల కూటమి రష్యాతో తెగదెంపులు చేసుకుంది. అదే సమయంలో నాటోలో భారత్​ రష్యా చేస్తున్న యుద్ధం తన దేశ సరిహద్దుల సమస్య అని గట్టిగా వాదిస్తూ ఆ దేశంతో మునుపటిలాగే అన్ని ద్వైపాక్షిక బంధాలను నిర్వహిస్తామని, అదే సమయంలో యుద్ధం ముగించేలా తమవంతు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేసింది. నాటో దేశాల నిర్ణయంతో ఏకీభవించలేదు. జై శంకర్​ ఈ చర్యలను సమావేశంలో తీవ్రంగా ఖండించి ప్రత్యామ్నాయాలపై ఆలోచించి యుద్ధాన్ని ముగించేలా చర్యలు చేపడతామని, ప్రపంచంలో ఒక దేశాన్ని ఏకాకిని చేయడం సరికాదని ప్రపంచదేశాలకు మోదీ విధానాన్ని నచ్చ చెప్పేందుకు ఎంతో ప్రయత్నించినా ఆ చర్యలు సఫలం సాధించలేదు. దీంతో భారత్​ మాత్రం తమ నిర్ణయంపై పటిష్ఠంగా నిలబడింది. 
 
ప్రస్తుతం రష్యా నుంచి భారత్​ కు రోజుకు 6 లక్షల బ్యారెల్స్​ ముడిచమురు అత్యంత చవకగా సరఫరా అవుతుంది. అదే ముడిచమురును భారత్​ లో శుద్ధి చేసి యూరోపియన్​ దేశాల డిమాండ్​ మేరకు రోజుకు 3 లక్షల బ్యారెల్స్​ చొప్పున ఎక్కువ ధరకు పంపుతుంది. అయినా యూరోపియన్​ యూనియన్​ దేశాలకు ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. 
 
యూరోపియన్​ దేశాల బడా చమురు సంస్థలు 90 ఉండగా ప్రస్తుతం 50 శాతం మూతపడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని మూతపడనున్నాయి. ఇందుకు కారణం రష్​యా నుంచి ముడిచమురు కొనకపోవడమే. పైకి ఆ దేశాలు బయోఫ్యూయల్​ తయారీ చేపడతామని చెబుతున్నా ఇది ఉత్తదే అని తేలిపోతుంది. మరోవైపు అమెరికా తమకు కావాల్సిన చమురును ఇబ్బడిముబ్బడిగా పెద్ద యెత్తున ఇస్లామిక్​ దేశాల నుంచి దిగుమతి చేసుకొని సేఫ్​ గా ఉంది. అమ్మోరికా మాట విన్న యూరోపియన్​ దేశాల సంస్థలు మాత్రం తీవ్ర నష్టాలతో మూతపడుతున్నాయి. చమురు డిమాండ్​ పెరుగుతుండడం, ఆశించిన స్థాయిలో లభించకపోవడం, ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో క్రమేణా ఆయా సంస్థలు మూతపడే దిశగా పయనిస్తున్నాయి. 
 
రష్యా ద్వారా భారత్​ కొనుగోలు చేసుకుంటున్న ముడిచమురును ఇక్కడే శుద్ధి చేస్తున్నారు. తద్ఫలితంగా మన అవసరాలకు పోనూ విదేశాలకు కూడా ఇక్కడి నుంచే తరలించి భారీ వృద్ధిని సాధిస్తున్నారు. గతంలో యూరోపియన్​ యూనియన్​ దేశాలకు 1.20 లక్షల బ్యారెల్స్​ ను భారత్​ పంపుతుండగా, ప్రస్తుతం ఆ డిమాండ్​ రోజుకు 3 లక్షల బ్యారెల్స్​ కు చేరింది. ఇందులోనూ భారీ డిమాండ్​ నెలకొంది. ముందుగా తమకే సరఫరా చేయాలంటే, తమకే చేయాలని ఈ దేశాలు భారత్​ కు మొరపెట్టుకుంటున్నాయి. 
 
అమెరికా తానే పెద్దన్నగా ప్రకటించుకుంటూ రష్యా లాంటి మోనోపాలి దేశాన్ని ఏకాకిని చేసే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. దీంతో ఇటు అమెరికాకు నష్టం ఏమీ లేకపోయినా, నాటూ యూనియన్​ సమావేశంలో రష్యాతో తెగదెంపులు చేసుకున్న యూరోపియన్​ యూనియన్​ దేశాలకు తీవ్ర నష్టం తప్పడం లేదు. అదే సమయంలో చైనాపై ప్రపంచదేశాలకు నమ్మకం సన్నగిల్లడంతో ఆ దేశం నుంచి లావాదేవీలను నిర్వహించేందుకు ఏ దేశమూ ముందుకు రావడంలేదు. ప్రత్యామ్నాయంగా మోదీ విధానాల వల్ల భారత్​ తో వ్యాపారం నిర్వహించడమే నమ్మకం, విశ్వసనీయతతో కూడుకున్నవని ఈ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు రష్యా యూరోపియన్​ యూనియన్​ దేశాలకు నేరుగా ఎగుమతులు చేసే ముడిచమురు కాస్త మరింత తక్కువ ధరలోనే భారత్​ కు పంపుతూ ఇక్కడి నుంచి ఆయా దేశాలకు ఎగుమతి అవుతుండడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు. మొత్తానికి అమ్మోరికాను నమ్మిన దేశాల పరిస్థితి నట్టేట మునిగినట్లయ్యింది. 
 
ఆ రోజూ ప్రధాని మోదీ ప్రభుత్వం నాటోదేశాల నిర్ణయాలతో ఏకీభవిస్తే ప్రస్తుత సమయంలో భారత్​ వృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడేది. ఒక్క మూర్ఖపు నిర్ణయంతో ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం, ఒక ప్రపంచాన్ని కూడా నష్టాల్లోకి, కష్టాల్లోకి తోయగలదని చరిత్రలో మరోమారు నిరూపితమైంది.