సీఎం సభలో చేపలు గాయబ్! రూ. 45 వేల నష్టం!
Fish missing in CM's meeting! Rs. 45 thousand loss!
పట్నా: సీఎం నితీశ్ కుమార్ సభ ముగియగానే ఆ రాష్ర్ట మృత్యశాఖ ఏర్పాటు చేసిన ఫిషరీ స్టాళ్లను ధ్వంసం చేసి కార్యక్రమానికి వచ్చిన వారంతా చేపలను ఎత్తుకెళ్లారు. శనివారం బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహార్సాలోని సభకు హాజరయ్యారు. దివారీలో ఉన్న ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం అమర్ పూర్ లో వివిధశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఈ ఎగ్జిబిషన్ లో మత్స్యశాఖ బయోఫ్లోక్ ను ఏర్పాటు చేసింది. ఇందులో అనేక రకాల చేపలను ప్రదర్శనకు ఉంచింది. సీఎం సభ ముగిసిన హెలికాప్టర్ లో ఇలా వెళ్లారో లేదో సభకు వచ్చిన జనాలు, పిల్లలు ‘దొరికింది దోచుకో.. దోచుకుంది వండుకొని తినుకో’ అన్నట్లుగా దొరికిన వాటిని దొరికినట్లుగా ఎత్తుకెళ్లారు. ఒక్కసారిగా అంతమంది చేపలను ఎత్తుకెళ్లుతుండడంతో వారిని ఆపేందుకు అధికారులు కూడా సాహసించలేకపోయారు. దీంతో మత్స్యశాఖకు రూ. 45వేల నష్టం వాటిల్లినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు.