భారత్​–చైనా సరిహద్దు వివాదంపై చర్చ

ధోవల్​ తో చైనా మంత్రి భేటీ

Dec 16, 2024 - 13:25
 0
భారత్​–చైనా సరిహద్దు వివాదంపై చర్చ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ – చైనా సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు ఉన్నతస్థాయిలో చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. డిసెంబర్​ 17,18న చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో అజిత్​ ధోవల్​ భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కరించేందుకు ధోవల్​ చైనాలో పర్యటించేందుకు బయలుదేరారు. ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చల కోసం ఆయన చైనా వెళ్లారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇది మొదటి ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు. రెండు దేశాల మధ్య చివరి ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు డిసెంబర్ 2019లో జరిగాయి. 

ఎల్​ ఎసీ (లైన్​ ఆఫ్​ కంట్రోల్​) సమస్యపై సమగ్ర అవగాహనను పెంపొందించడం, దీర్ఘకాలిక పరిష్కారాన్ని వివరించడం ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చల లక్ష్యం అని అధికార వర్గాలు ప్రకటించాయి. గాల్వాన 2020 ఘర్షణ తరువాత ఇంతపెద్ద స్థాయిలో చర్చలు జరగం ఇదే తొలిసారిగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 2020 కంటే ముందు ఉన్న పరిస్థితులపై చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయి. ఈ చర్చలు సఫలీకృతం అయితే కీలక మైలురాయిగా నిలుస్తుంది. భారత్​ – చైనా మధ్య మరిన్ని ఒప్పందాలు, సంబంధాలకు కారణంగా నిలిచే అవకాశం ఉంది.