నా తెలంగాణ, సంగారెడ్డి : జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.3.75 కోట్ల విలువచేసే 13.990 కిలోల అల్ప్రా జోలం, 950.285 కిలోల ఎండు గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. గురువారం ధ్వంసం అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని భాష మైలవరం పారిశ్రామిక వాడలో మెడికేర్ పరిశ్రమలో పర్యావరణానికి హాని కలిగించకుండా దహనం చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 13 కేసుల్లో ఆల్ప్రాజోలం 3-కిలోలు, ఎండు గంజాయి 950-కిలోలను, యన్.డి.పి.యస్, స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 3.75 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత చెడు ప్రలోభాలకు లోనవుతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. అదే సమయంలో నిషేధిత పదార్థాల క్రయ, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుడు జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు మెడికల్ కేర్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, పటాన్చెరు , సంగారెడ్డి డిఎస్పిలు రవీందర్, సత్తయ్య, ఇన్స్పెక్టర్ రమేష్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలూ నాయక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.