శ్రీలంకకు ధోవల్ నాలుగుదేశాల భద్రతా సమావేశం
కీలకాంశాలపై చర్చ రాష్ర్టపతి రణిల్ విక్రమ సింఘేతో భేటీ
కొలంబో: భారత్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ నాలుగు దేశాల సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఒకరోజు ముందే గురువారం శ్రీలంక చేరుకున్నారు. శుక్రవారం శ్రీలంక రాష్ర్టపతి రణిల్ విక్రమ సింఘేతో ధోవల్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో నాలుగు దేశాల అంతర్గత, బాహ్య భద్రతకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. ఆయా దేశాల భద్రతా సలహాదారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సముద్ర భద్రత, ఉగ్రవాదం, సైబర్ దాడులు, హిందూ మహాసముద్రంలో ఆధిపత్య ధోరణిపై నాలుగు దేశాలు కీలక చర్చలు జరపనున్నాయి.