విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన

టీఎస్​ హెచ్​ ఆర్​ సీ సుభాషిణి

Aug 25, 2024 - 19:53
 0
విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన

నా తెలంగాణ, సంగారెడ్డి: విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం హక్కులపై అవగాహన కలిగి ఉండాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ సుభాషిణి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటన్ చెరు మండలం ఇస్నాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెట్టుశ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి  హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు న్యాయవాది సుభాషిణితో పాటు సెక్రటరీ హోప్ విజయ్, మహేష్వర్ లు హాజరై విద్యార్థినులకు మానవహక్కుల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా మెలగాలన్నారు. ఉన్నత చదువులు చదువుకొని వృద్ధి సాధించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ బీనా శివశంకర్ గౌడ్, అరవింద్, వెంకట్, దిలీప్, పవన్, వేణు, సంపత్  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.