వ్యక్తిని కాపాడిన హోమ్ గార్డు
అభినందించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
నా తెలంగాణ, మెదక్: జిల్లాలోని టెక్మాల్ పరిధిలోని గుండువాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని హోమ్ గార్డ్ మహేష్ కాపాడిన తీరును జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్షాలు, వరదల్లో పోలీసులు తమవంతు బాధ్యతను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్వహించారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. జిల్లాలో అనేకమంది పోలీసులు వర్షాలు, వరదలు సందర్భంగా ఎంతోమందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితంగా కాపాడగలిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ కానిస్టేబుళ్లు బండి శ్రీనివాస్, సురేష్ నాయక్, కృష్ణ, రమేష్, మహేష్ హోమ్ గార్డ్ తదితరులు పాల్గొన్నారు.