అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్
Illegal sand tractors seized
నా తెలంగాణ, మెదక్: మెదక్ పట్టణంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మెదక్ పట్టణ శివారులోని పుష్పలవాగు నుంచి ఆదివారం నాలుగు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం తప్పదని తహశీల్దార్ లక్ష్మణ్ అన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక తవ్వకాలపై నిర్దేశిత ప్రాంతాలలో చేపట్టాలనే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకోవాలన్నారు. అటు తరువాత ఇసుకను నిబంధనల మేరకే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.