ముంబాయికి ఉగ్ర హెచ్చరికలు

హై అలెర్ట్​ లో పోలీసుల మాక్​ డ్రిల్స్​

Sep 28, 2024 - 13:09
 0
ముంబాయికి ఉగ్ర హెచ్చరికలు

ముంబాయి:  ముంబాయిలో ఉగ్రవాదుల బెదిరింపులు, హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. శనివారం బహిరంగ ప్రదేశాల్లో మహారాష్ర్ట పోలీసులు మాక్​ డ్రిల్స్​ నిర్వహించారు. దసరా, దీపావళి సమీపిస్తుండడంతో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్​ నిఘా వర్గాలు మహారాష్ర్ట ప్రభుత్వానికి అలర్ట్​ ను జారీ చేశాయి. దీంతో జన సమ్మర్థ ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పోలీసులు మైకుల ద్వారా సూచించారు. ప్రతీ దేవాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఆలయ పాలక వర్గాలకు సూచించారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను మోహరించాలన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులు నవరాత్రులనే టార్గెట్​ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ దేవాలయంలో వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. 

ముంబాయిలో ప్రసిద్ధ ఆలయం సిద్దివినాయక ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. కేంద్ర ఏజెన్సీల అప్రమత్తత తరువాత భద్రతను పెంచామన్నారు. పోలీసులు తెలిపిన నియమ నిబంధనలను పాటిస్తున్నామన్నారు.