ఐడీఎఫ్ దాడి.. హిజ్బొల్లా చీఫ్ కూతురు జైనబ్ మృతి
అమెరికా పర్యటన రద్దు చేసుకొని ఇజ్రాయెల్ కు నెతన్యాహు 30వరకు ఎమర్జెన్సీ ప్రకటన
జేరూసలెం: ఇజ్రాయెల్ – హిజ్బొల్లాల మధ్య యుద్ధం మరింత ముదిరింది. 27 అమెరికాలో జరుగుతున్న భద్రతా మండలి సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నెతన్యాహూ తన పర్యటనను కూడా రద్దు చేసుకొని తిరిగి ఇజ్రాయెల్ కు చేరుకున్నారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని బీరూట్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మృతి చెందగా, 90మందికి గాయాలయ్యాయి. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. హిజ్బొల్లా చీఫ్ నస్రుల్లా కూతురు జైనబ్ కూడా ఈ దాడుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జైనబ్ మృతి వార్తను హిజ్బొల్లా ధృవీకరించలేదు. ఐడీఎఫ్ జైనబ్ మృతి చెందిందని. పాక్ కు చెందిన మీడియా కూడా జైనబ్ మృతి చెందిందని తెలిపారు. ఐడీఎఫ్ చీఫ్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హిజ్బొల్లాకు కీలక ప్రాంతమైన బీరూట్ లో చీఫ్ నస్రుల్లా ఉన్నాడన్న సమాచారం అందింది. దాడుల్లో ఆయన గురించిన సమాచారం తెలియలేదు. ఆయన కూతురు జైనబ్ మృతిచెందిందన్నారు.
విషయం తెలుసుకున్న ప్రధాని నెతన్యాహు వెంటనే అమెరికా పర్యటనను రద్దు చేసుకొని ఇజ్రాయెల్ వచ్చారు. అక్కడ పరిస్థితులను సమీక్షించి ఈ నెల 30వ తేదీ వరకు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు.