నా తెలంగాణ, ఆదిలాబాద్: ప్లాస్టిక్ ను నివారించి, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని ఎమాయికుంట గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సరస్వతీ స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం లో శుభకార్యాలు జరిగినప్పుడు ప్లాస్టిక్ బదులు స్టీల్ గ్లాసులు, ప్లేట్స్ వాడుకోవాలన్నారు. దీనివల్ల ప్లాస్టిక్ ని నివారించవచ్చని తెలిపారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు.
గ్రామస్తులు అందరి భాగస్వామ్యంతో ఆన్ని మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని మోడల్ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న, ఎంపిడిఓ, ఎంపీవో, పంచాయితీ సెక్రటరీ, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.