నాస్ పరీక్షకు సన్నద్ధం చేయండి

జిల్లా విద్యా శాఖాధికారి ఏ.రవీందర్ రెడ్డి

Sep 27, 2024 - 20:39
 0
నాస్ పరీక్షకు సన్నద్ధం చేయండి

నా తెలంగాణ, నిర్మల్: డిసెంబర్​ లో జరిగే జాతీయ సాధనా సర్వే (నాస్) పరీక్షకు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డా. ఏ. రవీందర్ రెడ్డి కోరారు. దిలావర్ పూర్  మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న నిర్మాణాత్మక పరీక్షలను పరిశీలించారు. ప్రతి విద్యార్థి కి  ప్రింటెడ్ ప్రశ్న పత్రం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనం రుచిగా ఉండాలని, విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చూడాలని సూచించారు.