ఒకరి రక్తదానం.. ముగ్గురికి ప్రాణదానం
ఎస్పీ డా.జి. జానకి షర్మిల
నా తెలంగాణ, నిర్మల్: ఒక్కరు రక్త దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్మల్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జానకి షర్మిల మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. రక్తదానం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్ కేన్సర్ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ప్రాణాలను కాపాడటంలో తమవంతుగా ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో 120 యూనిట్ల రక్తం సేకరించారు. నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి , ఇన్స్ పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, నవీన్ కుమార్ , ఆర్ఐ లు రామ్ నిరంజన్ రావు, శేఖర్ , ఎస్సైలు , ఆర్.ఎస్సైలు, పోలీస్ సిబ్బంది రక్త దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.