శ్రీరామున్ని దర్శించుకున్న నటి ప్రియాంక

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, భర్త నిక్​ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్​తో కలిసి బుధవారం అయోధ్యలో బాలరామున్ని సందర్శించారు.

Mar 20, 2024 - 20:46
 0
 శ్రీరామున్ని దర్శించుకున్న నటి ప్రియాంక

అయోధ్య: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, భర్త నిక్​ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్​తో కలిసి బుధవారం అయోధ్యలో బాలరామున్ని సందర్శించారు. స్వదేశానికి రావడం శ్రీరాముని దర్శనభాగ్యం లభించడం సంతోషకరమని ప్రియాంక పేర్కొంది. చాలాకాలం తరువాత ప్రియాంక చోప్రా భారత్​కు వచ్చింది. మార్చి 19న అమెజాన్ కు చెందిన ఓ ఈవెంట్​లో పాల్గొన్న ప్రియాంక నేడు శ్రీరామున్ని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల ఆమెను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ వేదపండితుల ద్వారా ఆశీర్వచనాలు తీసుకున్న ప్రియాంక చోప్రా తన భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. సినిమాల్లో ఎలా నటించినా దేవాలయానికి భారతీయ వస్ర్తధారణ చీరకట్టుతో రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త నిక్​ జోనాస్​ కూడా కుర్తా పైజామాలో శ్రీరామున్ని దర్శించుకున్నారు.