పికప్​ వ్యాన్​ బోల్తా 17 మంది గిరిజనులు మృతి

సెమ్హార గ్రామంలో విషాద ఛాయలు

May 20, 2024 - 16:09
May 20, 2024 - 16:40
 0
పికప్​ వ్యాన్​ బోల్తా 17 మంది గిరిజనులు మృతి

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్​ వ్యాన్​ లోయలో బోల్తా పడి 17 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..సెమ్హార గ్రామం గిరిజనులు టెండు ఆకులు తెంపుకునేందుకు వ్యాన్​ లో బయలుదేరారు. ఆకులు తెంపుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా కవర్ధాలో వ్యాన్​ బ్రేక్​ లు ఫెయిలయ్యాయి. దీంతో 20 అడుగుల లోయలో వ్యాన్​ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందిలో 17 మంది చనిపోగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. కాగా మృతుల్లో 16 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంతో సెమ్హార గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుక్​ దూర్​ పోలీస్​ స్టేషన్​ లో ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారు హాహాకారాలు చేయడంతో గమనించిన స్థానికులు పోలీసులు, గ్రామస్థులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఆదివారం రాత్రి కూడా కొత్వాలి సింఘన్​ పురి గ్రామ సమీపంలో ఓ ట్రక్కు మూడు పోలీసు వాహనాలను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒక పోలీసు కానిస్టేబుల్​ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్​ సహా మరో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.