సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
నా తెలంగాణ, ఢిల్లీ: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. న్యూరోలాజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఎక్స్ మాధ్యమంగా మీడియాకు బుధవారం వివరాలందించారు. మార్చి 17న తలనొప్పితో సద్గురు అపోలోలో చేరారన్నారు. వినీత్ నేతృత్వంలో ఎంఆర్ఐ నిర్వహించి మెదడులో రక్తం గడ్డ కట్టుకుందని గుర్తించి ఆపరేషన్ చేపట్టామని సూరి తెలిపారు. ప్రస్తుతం సద్గురు ఆరోగ్యం క్రమంగా మెరగవుతోందని తెలిపారు. ఈషా ఫౌండేషన్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సద్గురుకు 2017లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.