హిందూ జనాభా తగ్గుదలపై ఆవేదన

దేశం విడిపోయే అవకాశం ఉన్నావ్​ ఎంపీ అభ్యర్థి సాక్షి మహరాజ్​

May 9, 2024 - 12:47
 0
హిందూ జనాభా తగ్గుదలపై ఆవేదన

లక్నో: హిందువుల జనాభా తగ్గడం, ముస్లింల జనాభా తగ్గడం పట్ల ఉన్నావ్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహరాజ్​ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల జనాభా తగ్గుదల వల్ల దేశం విడిపోయే అవకాశం ఉందని అన్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జనాభాపై ప్రధానమంత్రి ఆర్థిక మండలి నివేదికపై సాక్షి మహరాజ్​ గురువారం మీడియాతో మాట్లాడారు. జనాభా నియంత్రణకు కఠిన చట్టాలు అవసరమన్నారు.

హిందువుల జనాభా 8 శాతం తగ్గితే, ముస్లింల జనాభా 40 శాతం పెరిగిందని తాను విని బాధపడ్డానని పేర్కొన్నారు. పాక్​ లో విభజన సమయంలో 23 శాతం హిందువులు ఉండేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే హిందువులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా హిందువులపై పాక్​ లో మానవ హక్కుల ఉల్లంఘనలు అనేకం చోటు చేసుకున్నాయన్నారు. ఇది ప్రపంచానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఎంతోమందిని దేశం నుంచి బహిష్కరించారని, పలువురిని మతమార్పిడి చేశారని ఆరోపించారు. 

నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు చట్టం భారత్​ లో పనికిరాదన్నారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిందేనని డిమాండ్​ చేశారు. తాను ఎవ్వరి గురించి మాట్లాడబోనున్నారు. దేశహితం కోసమే మాట్లాడుతున్నానన్నది గుర్తెరగాలని సాక్షి మహరాజ్​ అన్నారు.

హిందూ ఆలయాలపై రాహుల్​ బాబా, అఖిలేష్​ లకు సదభిప్రాయం లేదన్నారు. వారు హిందు వ్యతిరేకులున్నారు. ఈసారి ఉన్నావ్​ లో మోదీ నేతృత్వంలో గెలవబోయేది తానే అని సాక్షి మహారాజ్​ స్పష్టం చేశారు. గత లోక్​ సభ ఎన్నికలలో 4 లక్షలకు పైగా తేడాతో సాక్షి మహారాజ్​ గెలుపొందడం విశేషం.