పార్శీల జనాభా అరికట్టేందుకు చర్యలు

జార్జ్​ సోరెస్​ పై సమాధానం చెప్పరేం? కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు

Dec 9, 2024 - 19:40
 0
పార్శీల జనాభా అరికట్టేందుకు చర్యలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మైనార్టీ గ్రూపులైన పార్శీల జనాభా క్షీణతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జియో పార్సీ పథకాన్ని ప్రారంభించిదని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. సోమవారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్శీలు, జొరాస్ర్టియన్ల జనాభా ఎన్నోయేళ్లుగా తగ్గుముఖం పడుతుందన్నారు. వారికి వైద్య, ఆరోగ్య శాఖ ఆర్థిక సహాయం అందించేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు. 1941లో దేశంలో 1.14 లక్షలకు పైగా పార్సీలు ఉన్నారని, 2011 జనాభా లెక్కల ప్రకారం 57 వేలకు క్షీణించారని చెప్పారు.

నేషనల్ కమీషన్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్ 1992 కింద గుర్తించిన వీరి జనాభా క్షీణతను అరికట్టేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. జియో పార్శీ పథకాన్ని ప్రారంభించామని, దీని ద్వారా ప్రభుత్వం వైద్య, ఆరోగ్య భాగాల కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. వంధ్యత్వ చికిత్సల కోసం సహాయం గరిష్టంగా ఆరు లక్షల రూపాయలను సహాయం చేస్తుందని కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. 

ఉభయసభల్లో కాంగ్రెస్​, కూటమి చేస్తున్న దేశ విచ్ఛిన్న ప్రయోజనాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయన్నారు. దేశ విచ్ఛిన్నానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు. జార్జ్​ సోరోస్​ సంస్థలు కాంగ్రెస్​ పార్టీ పెద్దలకు చెందిన ఫౌండేషన్​ కు నిధులు పంపించడాన్ని తప్పించుకునేందుకే ఉభయసభలను సజావుగా సాగనీయడం లేదన్నారు. కాంగ్రెస్​ పార్టీకి నిధులు అందాయన్నది జగమెరిగిన సత్యమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్​ అంశంపై నోరువిప్పని ఈ పార్టీలు సభలను, ప్రజలను పక్కదోవ పట్టించాలనే ఈ కుట్రకు తెరదీశాయన్నారు. వారి వద్ద వీటికి సమాధానాలు లేవన్నారు. అందుకే దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు అన్నారు.