‘మహా’ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్
Rahul Narvekar as 'Maha' speaker
ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ నేత రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో రాహుల్ నర్వేకర్ పేరును సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండేల పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబ్కర్ స్పీకర్ పదవిలో నర్వేకర్ కు ఆమోదముద్ర వేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ స్పీకర్ నర్వేకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నర్వేకర్ ఎన్నికపై అభినందనలు తెలిపారు. నిష్పక్షపాతంగా సభను నిర్వహించడం ద్వారా సభ సంప్రదాయాన్ని కాపాడతారని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా అభినందన ప్రసంగాలు చేశారు. ఎన్‌సిపి (ఎస్‌పి) ఎమ్మెల్యే జయంత్ పాటిల్, కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే, విజయ్ వాడెట్టివార్, ఇతరులు నూతన స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.