నకిలీ సమాచార వ్యాప్తి నియంత్రణకు చర్యలు

కేంద్ర సహాయ మంత్రి ఎల్​. మురుగన్​

Dec 6, 2024 - 18:04
 0
నకిలీ సమాచార వ్యాప్తి నియంత్రణకు చర్యలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నకిలీ తప్పుదోవ పట్టిచే సమాచార వ్యాప్తి నియంత్రణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్​. మురుగన్​ రాజ్యసభలో శుక్రవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే, సమాజాన్ని విచ్ఛిన్న చేసే సమాచారాన్ని అడ్డుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ధృవీకరించుకునేందుకు 2019లో ఫ్యాక్ట్​ చెక్​ ను ఏర్పాటు చేశామన్నారు. వార్తల ప్రామాణికతను దీని ద్వారా ధృవీకరించవచ్చన్నారు. ప్రింట్ మీడియా కోసం, వార్తాపత్రికలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన జర్నలిస్టిక్ ప్రవర్తనా నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇది నకిలీ లేదా పరువు నష్టం కలిగించే లేదా తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించడాన్ని నిరోధించాలని ఆయన అన్నారు. కౌన్సిల్ నిబంధనల ఉల్లంఘనలపై విచారణ నిర్వహించి, వార్తాపత్రిక, సంపాదకులు, జర్నలిస్టులు మొదలైనవారిని హెచ్చరించడం, ఖండించడం చేస్తుందన్నారు.  రెగ్యులేషన్​ యాక్ట్​ 1995 ప్రకారం అసభ్యకర, పరువు నష్టం కలిగిచే, ఉద్దేశ్యపూర్వక, తప్పుడు వార్తలు, దూషణలు, అర్థసత్యాలను ఉన్న కంటెంట్​ ను ప్రసారం చేయరాదని తెలిపారు.