చెడుపై మంచి విజయమే విజయదశమి

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Oct 13, 2024 - 19:10
 0
చెడుపై మంచి విజయమే విజయదశమి

నా తెలంగాణ, నిర్మల్: చెడుపై మంచికి లభించిన విజయానికి ప్రతీక విజయదశమి అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, ఆకాంక్షించారు. అనంతరం రావణాసుర దహనం చేశారు. సనాతన ధర్మానికి హిందూ ధర్మ రక్షణకు సైనికుడిలా పనిచేయాల్సిన,  హిందూ ధర్మ రక్షణకు అండగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.