నిత్య జీవితంలో భాగంగా యోగా

డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి

Jun 21, 2024 - 16:54
 0
నిత్య జీవితంలో భాగంగా యోగా

నా తెలంగాణ, నిర్మల్: నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని నిర్మల్ జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్సీసీ తెలంగాణ 32వ బెటాలియన్ ఆదిలాబాద్ అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగా అనాదిగా మానవ జీవితంలో భాగంగా మారిందని అన్నారు. భారతీయ సంప్రదాయంలో యోగవిద్య ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని అన్నారు. ఇందులో నిర్మల్ సెక్టర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రవి హై స్కూల్, జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల కస్బాకు చెందిన కాడెట్లు, కళాశాల ప్రిన్సిపాల్, ఎన్​సీసీ అధికారి లెఫ్టినెంట్ భీమా రావు, కస్బా పాఠశాల అధికారి యాటకారి సాయన్న, రవి హై స్కూల్ కరస్పాండెంట్  వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.