108లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం
Childbirth in 108. Mother and child are healthy
నా తెలంగాణ, నిర్మల్: ప్రభుత్వం వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా మారుమూల ప్రాంతాలకు అవి చేరటం లేదు. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందటం లేదు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి తాండా కు చెందిన మహిళ 108 లో సిబ్బంది సహాయంతో ప్రసవించింది. తండాకు చెందిన కవితకు శుక్రవారం పురిటి నొప్పులు రావటంతో సమీపంలో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవటంతో ఆమెను భైంసా ప్రభుత్వాసుపత్రికి 108లో తరలిస్తున్నారు. మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సహాయంతో ప్రసవించింది. అనంతరం ఆమెను భైంసా ఆసుపత్రికి తరలించారు. కాగా తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారు.