ఎఐతో ఆత్మహత్యలకు పాల్పడేవారిని ముందే గుర్తించొచ్చు!
జామా నివేదిక వెల్లడి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఆత్మహత్యకు పాల్పడే వారిని ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాంకేతికత ద్వారా గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయాన్ని జామా (జేఎఎంఎ–ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్) పరిశోధించిన నివేదికలో స్పష్ట చేసింది. రెండు విధానాల్లో ఈ పరిశోధన సత్ఫలితాలనిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారి మెదడు, కణజాలం ఎలక్ర్టానిక్ చార్ట్ లో ప్రమాద సమాచారాన్ని క్రోడీకరించి గుర్తించామన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తుల్లో ఒక విధంగా, సాధారణ వ్యక్తుల్లో ఒక విధంగా ఈ హెచ్చరికలు ఉన్నట్లుగా గుర్తించారు. తరచూ ఆర్థిక, మానసిక, ఆరోగ్య సంబంధ, కలహాల వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలో వెల్లడించారు. వారి అంతకుముందు చేసిన పరిశోధన పాజిటివ్ గా ఉండేదన్నారు. వీఎస్ ఎఐఎల్ ( వాండర్ బిల్ట్ సూసైడ్ అటెంప్ట్ అండ్ ఐడియేషన్ లైక్ లిహుడ్ మోడల్) అని ఈ సాంకేతికతను పిలుస్తారని, దీని ద్వారా న్యూరాలజీ వైద్యులు ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తులను ముందుగానే గుర్తించొచ్చని జామా నివేదిక స్పష్టం చేసింది.