సర్పంచ్​ హత్య నేరస్థులను వదలబోం

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​

Jan 5, 2025 - 17:19
 0
సర్పంచ్​ హత్య నేరస్థులను  వదలబోం

ముంబాయి: మహారాష్ట్ర బీడు జిల్లా మసాజోగ్​ సర్పంచ్​ సంతోష్​ దేశ్​ ముఖ్​ హత్య కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ అన్నారు.  ఆదివారం హత్య విషయంపై మీడియాతో మాట్లాడారు. సర్పంచ్​ హత్య కేసుపై ప్రభుత్వం ధృడ నిశ్చయతో విచారణ చేస్తుందన్నారు. నేరంలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదలబోమన్నారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటామన్నారు. దోపిడీని వ్యతిరేకించినందుకే సర్పంచ్​ ను చంపారని ప్రాథమిక వివరాలు, ఆరోపణలు ఉన్నాయన్నారు. హత్యను రాజకీయంగా చూడొద్దన్నారు. అవినీతి నిరోధక కార్యకర్త అంజలి అనీష్​ ఆరోపణలు అర్థంలేనివన్నారు. వాస్తవ కారణాలు విచారణలో తెలుస్తాయన్నారు. 
డిసెంబర్​ 9న సర్పంచ్​ సంతోష్​ దేశ్​ ముఖ్​ ను దుండగులు కిడ్నాప్​ చేశారు. అటుపిమ్మట హత్య చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మహారాష్ర్ట మంత్రి ధనంజయ్​ మొండే సన్నిహితుడు వాల్మిక్​ కరాద్​ పూణేలో పోలీసులు ముందు లొంగిపోయాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.