ఎంపీ సారంగిని నేను తోయలే.. రాహుల్ గాంధీ
I am MP Sarangini.. Rahul Gandhi
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బాలాసోర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గురువారం పార్లమెంట్ మెట్లపై కుప్పకూలారు. ఆయన తలకు గాయమైంది. తనను రాహుల్ గాంధీ నెట్టేశారని సారంగి ఆరోపించారు. పార్లమెంట్ లోని మకర్ ద్వార్ వద్ద బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ సభా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, చర్చలను సజావుగా సాగనీయడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టి రాహుల్ ను అడ్డుకున్నారు. దీంతో ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొని సారంగి మెట్లపై నుంచి కిందపడ్డారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని ప్రశ్నించగా బీజేపీ తనపై లేనిపోని అభాండాలు వేస్తుందని సారంగిని తాను తోయలేదన్నారు.