ప్రజాసమస్యలపై గళం విప్పుతాం
Let's raise our voice on public issues
2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: నూతన సంవత్సరంలోనూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే, ప్రజా సమస్యలపై గళం విప్పుతామని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ర్ట ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంవత్సరంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు చేకూరులాని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. బీజేపీపై ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. 2024లో పార్టీపై నమ్మకం, విశ్వాసంతో 36 శాతం ఓట్లతో 8పార్లమెంట్ స్థానాలను అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని ప్రజలు, కార్యకర్తలు పార్టీ పట్ల చూపిస్తున్న ఆదారాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.