ఆశారాంకు సుప్రీం బెయిల్!
Supreme bail for Asaram!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అత్యాచారం కేసులో ఆశారాం బాపునకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం మంగళవారం మంజూరు చేసింది. మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అత్యాచారం కేసులో 2013లో లైంగిక దాడి కేసులో గాంధీనగర్ దిగువకోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు పలు షరతులను విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయవద్దని, సాక్ష్యుల బెదిరింపులు, కలవడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. వైద్యపరమైన బెయిల్ మాత్రమేనని గుర్తుంచుకోవాలంది. శిక్షను సస్పెండ్ చేయాలన్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఆశారాం కుమారుడు నారాయణ్ సాయికి కూడా ఇదే కేసులో 2019 ఏప్రిల్ లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆశారాంపై 2013లో అహ్మాదాబాద్ లోని చంద్ ఖేడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.