ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు

Delhi elections on 5th February, counting of votes on 8th

Jan 7, 2025 - 15:10
Jan 7, 2025 - 15:17
 0
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మీడియా సమావేశంలో ఎన్నికల తేదీ, ఫలితాల తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించనుండగా, 8వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఢిల్లీలో ఎన్నికల్లో 1,55,24,858 మంది ఓటర్లుండగా, పురుష ఓటర్లు 83,49,645 లక్షలు, మహిళా ఓటర్లు71,73,952 లక్షలుగా పేర్కొన్నారు. 2.8 లక్షల మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారని, 830మంది వందేళ్లకు పైబడిన వారు ఉన్నారని వివరించారు. 85యేళ్లు పై బడిన వారు 1.09 లక్షలు ఉండగా వారికి ఇంటివద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. దీని కోసం ఫారం 12డిని నింపాల్సి ఉంటుందన్నారు. ట్రాన్స్​ జెండర్లు 1261, దివ్యాంగ ఓటర్లు 79,436మంది ఉన్నారని తెలిపారు.

2967 స్థానాలలో13,330 పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలింగ్​ స్టేషన్​ లో 1191 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మోడల్​ పోలింగ్​ స్టేషన్లు 210, మహిళలు నిర్వహించేవి 70, పీడబ్ల్యూడీ నిర్వహించే పోలింగ్​ స్టేషన్లు 70గా ప్రకటించారు. 

ఎన్నికల షెడ్యూల్​..
జనవరి10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్​ 
18న నామినేషన్ల పరిశీలన
20 వరకు నామినేషన్ల ఉపసంహరణ
ఫిబ్రవరి 5న ఎన్నికలు
ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు

మొత్తం 70 స్థానాలకు గాను 11 జిల్లాల్లో 58 స్థానాలు జనరల్​, 12 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు.