రాజకీయాల నుంచి తప్పుకున్న ఆప్​ ఎమ్మెల్యే

అసెంబ్లీ స్పీకర్​ రామ్​ నివాస్​ గోయల్​

Dec 5, 2024 - 13:22
 0
రాజకీయాల నుంచి తప్పుకున్న ఆప్​ ఎమ్మెల్యే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ కు మరో షాక్​ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్​ రామ్​ నివాస్​ గోయల్​ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గురువారం ఆప్​ అధినేత కేజ్రీవాల్​ కు లేఖ రాశారు. ఆప్​ ఎమ్మెల్యేలు, పార్టీ తనకు చాలా గౌరవం ఇచ్చిందన్నారు. వయసు రీత్యానే రాజకీయాలకు దూరం కావాలని భావించానని అన్నారు. అందుకే రిటైర్మెంట్​ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పదేళ్లుగా తాను షహదారా ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్​ గా తన బాధ్యతలను నిర్వర్తించానని అన్నారు. పార్టీ నేతలు తనకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఆప్​ నకు తన సేవలు అవసరం అయితే సిద్ధంగా ఉంటానని గోయల్​ ప్రకటించారు.