నిరాహార దీక్ష విరమించిన అతిషి

విమర్శించిన స్వాతిమాలివాల్​

Jun 25, 2024 - 16:15
 0
నిరాహార దీక్ష విరమించిన అతిషి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ జలశాఖ మంత్రి అతిషి ఎట్టకేలకు నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం విరమించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు దీక్షను విరమించారు. ఢిల్లీకి నీరు కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతిషి ఆరోగ్యం విషమించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. 

కాగా అతిషి నిరాహర దీక్షపై ఆప్​ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్​ విమర్శలు చేశారు. గతంలో తాను పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేశానని తెలిపారు. అతిషి చేసిన దీక్ష కేవలం ప్రజాభిమానం పొందేందుకే అన్నారు. ఇది రాజకీయ పరమైన దీక్షే తప్ప ప్రజాసంక్షేమం కోసం చేపట్టిన దీక్ష కాదని మాలివాల్​ విమర్శించారు.