నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: విద్యలో సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు పటిష్ఠంగా అమలు తదితర అంశాలపై గవర్నర్లతో రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అధ్యక్షతన తొలిసారిగా రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్లు సమావేశమయయారు. ఈ సమావేశం రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సమావశానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ఉప రాష్ర్టపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి అశ్విని వైష్ణవ్, డాక్టర్ మన్సుఖ్ మాండవీయా, పలువురు కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, పీఎంవో ఉన్నతాధికారులు, హోంశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సరిహద్దులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణాన్ని పరిరక్షించడం, దేశీయ వ్యవసాయానికి ఊతం ఇచ్చే చర్యలపై గవర్నర్లకు వివరించారు. రాష్ట్రంలోని వివిధ కేంద్ర సంస్థల మెరుగైన సమన్వయాన్ని కల్పించడంలో గవర్నర్ల పాత్ర కీలకమన్నారు. అదే సమయంలో మంచిని ప్రోత్సహించే మై భారత్, ఏక్ పెద్ మాకే నామ్ లాంటి కార్యక్రమాలలో కూడా గవర్నర్ల పాత్ర ఉండాలని అన్నారు.