కీవ్​ లో మోదీకి ఘన స్వాగతం

A warm welcome to Modi in Kiev

Aug 23, 2024 - 12:40
Aug 23, 2024 - 13:10
 0
కీవ్​ లో మోదీకి ఘన స్వాగతం

కీవ్: పోలాండ్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ కీవ్ చేరుకున్నారు. శుక్రవారం మోదీ రైల్ ఫోర్స్ వన్ లో పది గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత కీవ్ కు చేరుకున్నారు. కీవ్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి జై, భారత్‌ కీ జై అంటూ పలువురు ప్రవాస భారతీయులు నినాదాలు చేశారు. ఉక్రెయిన్ అధికార మోదీకి ఘన స్వాగతం పలికింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం భారత్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. ఈ దిశగా జెలెన్స్కీతో ఇరుదేశాల్లో శాంతికోసం చర్చలు జరపనున్నారు. అదే సమయంలో భారత్–ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న బంధాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ప్రధాని మోదీ 200మంది భారతీయులతో కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రవాసీయుల వెంట భారత్ ఉందని భరోసా ఇచ్చారు.