కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ అలయెన్స్ గా పోటీ
సీట్ల మధ్య కొలిక్కిరాని స్ఫష్టత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాల మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్టంలో ఉన్న 90 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఎవరికెన్ని సీట్లన్నీ విషయాన్ని తరువాత తెలియజేస్తామన్నారు. ఈ సీట్ల విషయం ఓ కొలిక్కి రాలేదు. జమ్మూకశ్మీర్ లో అధికారంలోకి వస్తామని ఇరుపార్టీలు ఆశిస్తున్నట్లు తెలిపారు.