నేపాల్​ లో బస్సు ప్రమాదం 14మంది భారత యాత్రికుల మృతి

కొనసాగుతున్న సహాయక చర్యలు

Aug 23, 2024 - 12:45
Aug 23, 2024 - 13:09
 0
నేపాల్​ లో బస్సు ప్రమాదం 14మంది భారత యాత్రికుల మృతి

ఖాట్మాండు: నేపాల్‌లోని పోఖ్రా నుంచి ఖాట్మాండు వెళుతున్న భారతీయ యాత్రికుల బస్సు నదిలో పడింది. శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 40 మంది యాత్రికులున్నట్లు ఉన్నాయి. ఈ యూపీ బస్సు యాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 14 మంది ఉన్నారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ లోని తనూహా నదిలో బస్సు అదుపు తప్పి దూసుకుపోయి ఉంది. అధికారులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతులు ఎంతమంది అన్నది ఇంకా స్పష్టత రాలేదు.