ముడాపై దర్యాప్తు.. సీఎం రాజీనామా చేయాలన్న బీజేపీ
Investigation on Muda.. BJP wants CM to resign
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కర్ణాటక ముడా కుంభకోణం విలువ రూ. 5వేల కోట్లని దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ నేత సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. శనివారం కర్ణాటక గవర్నర్ ముడా కుంభకోణంపై సీఎం, మరో 9మందిపై కేసు నమోదుకు అనుమతించడంతో సంబిత్ పాత్ర న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద అవినీతికి పాల్పడుతోందని తాము తొలుత నుంచి చెబుతున్నామని తెలిపారు. దోపీడీ, అసత్యాలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక ప్రభుత్వాల తీరు ఆ ప్రాంత ప్రజలకు నష్టం చేకూరే విధంగా ఉందని సంబిత్ పాత్ర మండిపడ్డారు.
ముడా కుంభకోణంలో సీఎం సతీమణి, మిత్రులు, సన్నిహితులు, బంధువుల పేర్లపై సిద్ధరామయ్య భూములను కొల్లగొట్టారని షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ప్రభుత్వంలోని ప్రతీశాఖను లూటీ చేసేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.