టెర్రర్ ఫండింగ్.. ఉచ్చుబిగుస్తున్న ఎన్ఐఏ
ఐదు రాష్ర్టాలు 22 ప్రాంతాల్లో ఎన్ ఐఏ సోదాలు అనుమానాస్పద వస్తువులు, కీలకపత్రాలు స్వాధీనం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నలుగురిని అరెస్టు చేయగా పలు కీలక పత్రాలు, అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురికి నోటీసులు జారీ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే ఆర్థిక మూలాలపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఎన్ ఐఏ ఈ దాడులను కొనసాగించింది.
ఢిల్లీ, కాశ్మీర్, మహారాష్ర్ట, యూపీ, అసోం ఐదు రాష్ర్టాల్లోని 22 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా పాక్ కు చెందిన జైష్ ఏ మహమ్మద్ నెట్ వర్క్ విస్తరించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఉగ్రమూలాలను కేంద్ర హోంశాఖ కత్తిరిస్తోంది. వీరికి నిధులను సమకూరుస్తున్న వారిపై దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులకు ఈ ఉగ్రవాద సంస్థకు నిధులను మళ్లిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది.
ఢిల్లీలోని ముస్తాఫాబాద్, జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా తదితర ప్రాంతాల్లో కీలక ఆధారాలను సేకరించింది.