డ్రైవర్​ లేకుండా ఇంజన్​ బోగీ పరుగు!

విచారణ చేపట్టిన అధికారులు

Nov 11, 2024 - 13:46
 0
డ్రైవర్​ లేకుండా ఇంజన్​ బోగీ పరుగు!

పాట్నా: బిహార్​ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డ్రైవర్​ లేకుండానే రైలు ఇంజన్​ బోగీ ముందుకు వెళ్లింది. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇంజన్​ బోగీ పట్టాలు తప్పడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నవంబర్​ 8న ఘటన చోటు చేసుకున్నట్లు అధికార వర్గాలు సోమవారం చేపట్టగా మీడియాకు విషయం పొక్కింది. 

 బిహార్​ ముంగేర్​ జిల్లాలో జమాల్​ పూర్​ స్టేషన్​ లో 30029రైలుకు సంబంధించిన లోకో పైలెట్​ ఇంజన్​ ను పార్క్​ చేసి వెళ్లాడు. కాసేపటి తరువాత ఇంజన్​ ఆటోమేటిక్​ గా 50 మీటర్ల వరకు ముందుకు కదిలింది. దీంతో మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. వెంటనే గమనించిన రైల్వేశాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంజన్​ బోగీని ట్రాక్​ పైకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. ఇంజన్​ బోగీ దానంతట అదే ముందుకు వెళ్లడంపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. వాటిని మరో ట్రాక్​ ద్వారా దారిమళ్లించామన్నారు.