పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
A spirited gathering of alumni
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్‌లో ఆదివారం పూర్వ విద్యార్థులు 22 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కలుసుకున్నారు. హై స్కూల్ లో 2001-–02 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాటి గురువులను సన్మానించారు. నాటి విద్యాబోధనతోనే ఉన్నత స్థాయికి ఎదగారని పూర్వ విద్యార్థులు గురువర్యులను కొనియాడారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పలువురు పూర్వ ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులను అందరినీ కలవడం తమకెంతో సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు ఉపాధ్యాయులు అర్జయ్య, కుమార్, సురేందర్, ఒడ్నాల శ్రీనివాస్, పద్మజ, నయోమి, యోహాను, శంకర్, శ్రీనివాస్ ఉన్నారు.