ప్రతీ నిరుపేదకు రోటి కపడా మకాన్​

ప్రధాని మోదీ లక్ష్యం 80 కోట్ల మందికి ఉచిత రేషన్​ మహారాష్ర్ట సీఎం షిండే

Apr 20, 2024 - 13:11
 0
ప్రతీ నిరుపేదకు రోటి కపడా మకాన్​

నాందేడ్​: ప్రతీ నిరుపేదకు ‘రోటి కపడా మకాన్​’ను కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీదని మహారాష్ర్ట సీఎం షిండే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 80 కోట్ల మంది నిరుపేదలకు మరో ఐదేళ్లు ఉచితంగానే ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహారాష్ర్ట నాందేడ్​ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి శనివారం ఉదయం పాల్గొన్న సందర్భంగా సీఎం షిండే సభలో ప్రసంగించారు.

దేశంలో ఎక్కడా, ఎన్నడూ కల్పించని విధంగా నిరుపేదల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ పాటుపడుతున్నారని తెలిపారు. దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని ఏనాడైనా పట్టించుకుందా? అని ప్రశ్నించారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వృద్ధితోపాటు, కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాయన్నారు. అదే సమయంలో దేశంలోని అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ శాంతియుత వాతావరణంలో భారత్​ ను నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి అచంచలమైనదని సీఎం షిండే తెలిపారు.