ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​

Polling for 42 assembly seats in Odisha

Jun 1, 2024 - 12:37
 0
ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​

ఢిల్లీ: ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు గాను శనివారం ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీకి మే 13, 20, 25 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. నాలుగో విడత జూన్​ 1(శనివారం) 42 స్థానాలకు పోలింగ్​ కొనసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా 36వేల మంది భద్రతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 72వేల మంది అధికారులు పోలింగ్​ విధులను నిర్వర్తిస్తున్నారు. 2,280 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఉప ఎన్నికలు..

ఒడిశాతో బాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా శనివారమే నిర్వహిస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ లోని సుజాన్​ పూర్​, కూట్​ లైహద్​, ధర్మశాలా, బడ్సార్​, లాహోల్​ స్తపతి, గాగ్​ రెట్​, యూపీలోని దుద్దీ, పశ్చిమ బెంగాల్​ లోని బారానగర్​ అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్​ నిర్వహిస్తున్నారు.