ఇజ్రాయెల్ కమాండర్ మృతి
35మందికి గాయాలు హిజ్బొల్లా ప్రధాన కార్యాలయం పేల్చివేత
జెరూసలేం/బీరూట్: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లాతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. బుధవారం జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కమాండర్ ఇట్జాజ్ ఓస్టర్ (22) మృతి చెందగా, 35మందికి తీవ్ర గాయాలయ్యాయి. అల్ మనార్ లోని మారున్ అల్ రాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని హెలికాప్టర్ ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
అదే సమయంలో బుధవారం మధ్యాహ్నం తరువాత లెబనాన్ లోని హిజ్భొల్లా ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ కార్యాలయం పేల్చివేతతో 150 హిజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేశామంది. కార్యాలయంలో పెద్ద యెత్తున ఉగ్రవాదులు చనిపోయారని సంఖ్య ఎంత అని తెలియదని తెలిపింది.